ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే.దీంతో ఆయా పార్టీలో మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి.
అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కౌలు రైతులకు( Tdp Manifesto ) ప్రతి ఏడాది 20,000 సహాయం చేస్తామంటూ కీలక ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఇదే అంశంపై ఏపీలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
టిడిపి ప్రభుత్వం( TDP ) అన్నట్టుగా ఇది ఎంత మంది రైతులకు వర్తిస్తుంది.కౌలు రైతు అన్న విషయం ఎలా తెలుస్తుంది.
భూమి యజమాని ఈ మేరకు ధృవీకరించాలి.
నూటికి తొంభై మంది భూమి యజమానలు లిటిగేషన్లకు భయపడి ఏ ఒక్కరికీ తమ భూమి కౌలుకు ఇచ్చినట్లు అధికారికంగా ధృవీకరణ పత్రం ఇవ్వరు.అందుకే ఇప్పటికే అమలులో ఉన్న ఈ పథకం నీరు గారిపోయింది.కానీ ఇప్పుడు అదే రూల్ అంటే సమస్య.
లేదు ఏ దృవపత్రం అవసరం లేదు అంటే ఏ పార్టీ పరంగానో, ప్రభుత్వ పరంగానో ఎంపిక చేస్తే ఇక జరిగే అవకతకవల విషయం గురించి చెప్పాల్సిన పనిలేదు.అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే చెందుతుంది లేదంటే లేదు.
అది కూడా లేదంటే చేతివాటం, ముడుపులు అన్నవి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో కవులు రేట్లు భారీగా తగ్గిపోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత రోజుల్లో ఉన్న ఖర్చులకు భయపడే చాలామంది రైతులు కూడా భూములు కవులు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు.అయితే కౌలు రైతుల సమస్య( Tenant Farmers ) ఎప్పుడూ ఉండనే ఉంటుంది.ఎందుకంటే అసలు రైతుల కన్నా కౌలు రైతుల సంఖ్యనే ఎక్కువగా ఉంది.మరి ఇటువంటి సమయంలో టీడీపీ చెప్పినట్టుగా ఆ స్కీమ్ అమ్మలు అవ్వడం అన్నది సాధ్యమేనా అన్నది చూడాలి మరి.