కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రయోజనం చేకూరేలా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్( Ministry India Trade Promotion Organisation ) శుభవార్త అందించింది.యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు.
2023 సంవత్సరం నవంబర్ 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.మొత్తం 20 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 70 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ( BE, B.Tech )పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.కనీసం 60 శాతం మార్కులతో మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
విద్యార్హతతో పాటు పని చేసిన అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు విద్యార్హతతో పాటు అనుభవం కూడా ఉండాలి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా 60,000 రూపాయల వేతనం లభించనుంది.దరఖాస్తు చేసుకోవడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
వరుసగా జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.