తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలన్నది ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కర్ణాటక ప్రజల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడినట్లైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.40 శాతం కమిషన్ అడుగుతున్నారని బీజేపీని సాగనంపారన్న కేటీఆర్ కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా కమిషన్ అడుగుతోందని విమర్శించారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు.హైదరాబాద్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేసింది బీఆర్ఎస్సేనని తెలిపారు.రాష్ట్రానికి హైదరాబాద్ ఆదాయ వనరని పేర్కొన్న కేటీఆర్ హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందని చెప్పారు.ఈ క్రమంలో కాంగ్రెస్ కావాలో.
కేసీఆర్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.







