పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు మధ్య ఆర్థికపరమైన సమస్యలు వెంటాడాయి.దీనికి తోడు భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలోనే దీపావళి పండగ రోజు భార్యను హతమార్చి భర్త పరారైన ఘటన హైదరాబాద్ నగరంలో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
నేరేడుమెట్ సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ శ్రీగరి పల్లికు చెందిన మహేందర్( Mahender ), వరంగల్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన స్రవంతి( sravanthi ) (22) ప్రేమించుకున్నారు.
కులాలు వేరైనా వివాహ బంధంతో ఒకటవలని 2019లో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ నగరంలో కొత్త కాపురం ప్రారంభించారు.మహేందర్ కార్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
వీరికి ఒక కుమార్తె సంతానం.
మహేందర్ ఏడాది క్రితం ఉప్పల్ పరిధిలోని జవహర్ నగర్( Jawahar Nagar in Uppal ) లోని కందిగూడాలో ఉండగా ఓ కేసు విషయంలో జైలుకు వెళితే.
భార్య స్రవంతి బెయిల్ పై భర్తను బయటికి తీసుకొచ్చింది.బెయిలు ఖర్చు విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమైంది.
ఒకపక్క ఆర్థిక సమస్యలు, మరొక పక్క దంపతుల మధ్య గొడవలు భరించలేకపోయిన స్రవంతి తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.

శనివారం భర్త మహేందర్ భార్య స్రవంతికి ఫోన్ చేసి ఆదివారం ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పడంతో.ఆదివారం స్రవంతి హైదరాబాద్ వచ్చింది.భర్త తన వస్తువులు మాత్రమే తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండడంతో మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
క్షణికావేశంలో మహేందర్ స్రవంతి ముఖంపై తలపై కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచింది.ఒక చున్నీ ఆమె మెడకు కట్టి ఈడుచుకెళ్ళి మంచం కింద పడేసి, ఇంటికి తాళం వేసి అక్కడనుండి పరారయ్యాడు.

స్రవంతి అన్న ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్రవంతి ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే మంచం కింద స్రవంతి విగత జీవగా పడి ఉంది.వెంటనే ప్రశాంత్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని మహేందర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ శివకుమార్ తెలిపారు.







