వికారాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పరిగి మండలం జైదుపల్లిలో చిరుత కనిపించిందని తెలుస్తోంది.
తాజాగా జైదుపల్లి రోడ్డులో ఓ వాహనదారుడికి చిరుత పులి అడ్డువచ్చింది.అయితే చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పదిహేను రోజుల కిందట పుడూరు మండలంలోని దామకుండం అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.తాజాగా మూడు రోజుల కిందట పుడూరు ఎంకేపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గుర్తించారు.
అలాగే చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.







