ఆమెను కలిసిన వారికీ డయాబెటీస్ వస్తుంది.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా దర్శకులలో వివాదాస్పద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది.ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ తనకు తోచింది మాట్లాడటంతో ఎన్నోసార్లు వివాదాలకు కారణం అవుతుంటాడు.

 Rgv, Dear Megha Pre Release Event, Megha Akash, Diabetes,latest News Tollywood-TeluguStop.com

తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘డియర్‌ మేఘ’ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొని సినిమా హీరోయిన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అర్జున్‌ దాస్యన్‌ నిర్మాణ సారథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మేఘ ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డియర్‌ మేఘ’.

ఎన్నో భావోద్వేగమైన అంశాలతో ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రామ్ గోపాల్ వర్మ హాజరై సినిమా గురించి ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ బాగుందని తెలియజేస్తూ చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు.

Telugu Dear Megha Pre, Diabetes, Megha Akash-Movie

అదే విధంగా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఈ అమ్మాయి చాలా స్వీట్ అని, ఈమెను కలిసిన వారికి డయాబెటిస్ వస్తుందని తెలిపారు.40 సంవత్సరాల క్రితం ఇలాంటి అమ్మాయిని కలిసి ఉంటే ఇప్పుడు నేను ఇలాగా ఉండే వాడిని కాదని హీరోయిన్ మేఘ పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు.ఇక హీరో గురించి మాట్లాడుతూ అతనిని పొగిడితే అందరికీ నా పై వేరే అనుమానాలు వస్తాయి కాబట్టి నేను అలా చేయను, అదిత్‌ లో అద్భుతమైన నటుడు దాగి ఉన్నాడు సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు త్వరలోనే తనతో ఓ సినిమా తీస్తానని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube