రెడ్ బనానా సాగుకు అనువైన నేలలు.. అధిక దిగుబడి కోసం సూచనలు..!

వ్యవసాయంలో ఎన్నో కొత్త మార్పులు.ఎన్నో కొత్త పంటలు అందుబాటులోకి వచ్చినా కూడా అవగాహన లేకపోవడంతో రైతులు కొన్ని పంటలు పండించడానికి ఆసక్తి చూపించలేకపోతున్నారు.

 Cultivation Of Red Banana And Suitable Soils Details, Cultivation Of Red Banana,-TeluguStop.com

అయితే ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి కొత్త పంటలు పండిస్తున్న రైతులు అధిక లాభాలు పొందుతున్నారు.రెడ్ బనానా( Red Banana ) సాగుపై పూర్తిగా అవగాహన తెచ్చుకుని కొందరు రైతులు ( Farmers ) మంచి లాభాలు పొందుతున్నారు.

ప్రస్తుత మార్కెట్లో పండించిన పంటను విదేశాలకు మార్కెటింగ్ చేయడం చాలా సులభతరం అయ్యింది.

కాబట్టి రైతులు మార్కెటింగ్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

రైతులు కొత్త పంటలపై అవగాహన తెచ్చుకొని సాగు చేస్తే చాలు.లాభాలు పొందవచ్చు.

రైతులు పండిస్తున్న కొత్త పంటలలో రెడ్ బనానా సాగు( Red Banana Cultivation ) అధిక విస్తీర్ణంలో సాగు అవుతుంది.ఈ అరటిపండు చాలా రుచిగా ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

బెంగుళూరు, కోయంబత్తూర్ నర్సరీలలో ఈ రెడ్ బనానా సీడ్ అందుబాటులో ఉంది.ఇవి పిలకల రూపంలో విక్రయించబడతాయి.ఒక్కో పిలక ధర రూ.25 వరకు ఉంటుంది.

Telugu Agriculture, Banana, Bangalore, Coimbatore, Crop, Red Banana, Redbanana-A

నీటి వనరులు పుష్కలంగా ఉంటే ఏడాది పొడవునా ఎప్పుడైనా ఈ రెడ్ బనానా సాగు చేయవచ్చు.అయితే రైతులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సాధారణ అరటి మొక్కలలా కాకుండా ఈ ఎర్రటి అరటి మొక్కలు ఎత్తుగా, దృఢంగా, వెడల్పుగా పెరుగుతాయి.కాబట్టి మొక్కల మధ్య దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఇక వరుసల మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి.ఒక ఎకరం విస్తీర్ణంలో 800 మొక్కలను నాటుకోవాలి.

Telugu Agriculture, Banana, Bangalore, Coimbatore, Crop, Red Banana, Redbanana-A

ఒక ఎకరానికి దాదాపుగా 60 వేల వరకు పెట్టుబడి అవుతుంది.మొక్క ఐదు అడుగులు పెరిగిన తర్వాత వంగిపోకుండా సపోర్టుగా కర్రలను పాతాలి.ఒక అరటి గెల సుమారుగా ధర రూ.400 వరకు పలుకుతుంది.సాధారణ అరటి సాగులో ఈదురు గాలులు, వర్షాలు వస్తే ఎంత నష్టం వస్తుందో రైతులకు తెలిసే ఉంటుంది.

కానీ ఎర్ర అరటి మొక్కలు ఈదురు గాలులు, వర్షాలను తట్టుకొని దిగుబడి ఇస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube