ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.ఈ కారణంగా ఆడ పిల్లలు ఇంట్లోని కుటుంబ సభ్యులను నమ్మాలంటే భయపడుతున్నారు.
అయితే ఓ వ్యక్తి తను కట్టుకున్న భార్య ఉండగానే మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం నగరి ఎమ్మెల్యే మరియు సీనియర్ నటి రోజా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి బతుకు జట్కా బండి అనే కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే ఇద్దరు దంపతులు పెళ్లయిన కొత్తలో చాలా అన్యోన్యంగా ఉండే వాళ్ళు.అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె భర్త అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపాడు.
ఇందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకున్నానంటూ ముగ్గులోకి దింపాడు.దీంతో అతడి మాటలు నమ్మిన యువతి అతడికి సర్వస్వము అర్పించింది.ఈ విషయం తెలుసుకున్నటువంటి అతడి భార్య అక్రమ సంబంధం గురించి పలు మార్లు హెచ్చరించింది.అంతేగాక తన అత్త మామలతో కూడా ఈ విషయం గురించి చెప్పినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది.
దీంతో చేసేదేమీ లేక తన బంధువుల సహాయంతో వివాహిత బతుకు జట్కాబండి కార్యక్రమానికి తీసుకొని వచ్చింది.అయితే ఇందులో భాగంగా ముగ్గురిని విచారించిన అటువంటి రోజా ఆ వ్యక్తిని తన చెల్లెలు వరుస అయ్యేటువంటి యువతి మెడలో తాళి కట్టాలంటూ తీర్పునిచ్చింది.
అంతేగాక తాళిబొట్టు ను కూడా తీసుకు వచ్చి చూపిస్తూ యువతి మెడలో కట్టాలని గద్దించింది.