అతి ఆకలి.ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు.అతి ఆకలి సమస్యే కాదనుకుంటారు కొందరు.కానీ, అతిగా ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి లాగించేస్తుంటారు.తద్వారా అధిక బరువు పెరిగిపోతారు.అధిక బరువు పెరగడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు ఇలా ఏదో ఒక సమస్య వస్తుంటుంది.
అందుకే అతి ఆకలిని కట్టడి చేసుకోవడం చాలా అవసరం.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను ఫాలో అయితే.
సులువుగా అతి ఆకలికి చెక్ పెట్టవచ్చు.
అతి ఆకలిని తగ్గించుకోవాలి అని అనుకునే వారు ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ ఫస్ట్‌లో ఓట్ మీల్ తీసుకోవాలి.
ఎందుకంటే, ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఓట్ మీల్ ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగిస్తోంది.తద్వారా అతి ఆకలికి చెక్ పెట్టవచ్చు.ఓట్ మీల్ తీసుకోవడం మరో ప్రయోజనం ఏంటంటే, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.అధిక బరువును అదుపులో ఉంచుతుంది.
తగినంతగా నిద్ర లేకపోవడం కూడా అతి ఆకలికి ఒక కారణం.
నిద్ర తగ్గినప్పుడు ఆకలిని నియంత్రించే లెఫ్టిన్ మరియు గ్రెలిన్ హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.
కాబట్టి, కనీసం రోజుకు ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రించండి.అలాగే అతి ఆకలిని నియంత్రించడంలో కాఫీ గ్రేట్‌గా సహాపయడుతుంది.
రోజుకు ఒక కప్పు లేదా రెండు కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల అందులో ఉండే కెఫెన్ అతి ఆకలిని చంపేస్తుంది.తద్వారా ఇతర ఆహార పదార్థాలను తీసుకోలేరు.
అలాగే నట్స్ తీసుకోవడం వల్ల కూడా అతి ఆకలిని నియంత్రించవచ్చు.ప్రతి రోజు బాదం, వాల్‌నట్స్, పిస్తా పప్పు ఇలాంటివి డైట్‌లో చేర్చుకోవాలి.యాపిల్, అవకాడో వంటి పండ్లు తీసుకోవడం ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.తద్వారా ఆకలి వేయకుండా ఉంటుంది.
మరియు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా అతి ఆకలికి చెక్ పెట్టవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.