అడవుల్లో సిఎమ్ కారు ప్రయాణం

మున్నెన్నడూ ఏ సీఎం చేయని సాహసాన్ని తెలంగాణా సీఎం కెసిఆర్ చేయడానికి వీసమెత్తు జంకలేదు దట్టమైన అటవీ ప్రాంతంలో కేసీఆర్ ఆయన పేషీ కార్ల సమూహంతో రాజు వెడలె రవి తేజము లలరగా ….అనే తీరులో వెళ్ళారు .

 Cm Kcr Takes Forest Route From Bhadrachalam-TeluguStop.com

అప్పటికే అధికార్లు చెప్పకే చెప్పారు .జనసంమర్ధత గల రోడ్లు వదిలేసి అడవి ప్రాంతాలేందుకు అని చెప్పినా కెసిఆరు ఏమి కాదు పదండయ్యా అని అటవీ మార్గంలో వెళ్ళడానికి ఏమాత్రం వెనుకాడలేదు వరంగల్‌కు తొలుత వెళ్లి ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం మణుగూరు మీదుగా ముఖ్యమంత్రి వాహనశ్రేణి రోడ్డు మార్గంలో వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది.మణుగూరు నుంచి ఆఖరు నిమిషం లో రూట్ మార్చారు .కేసీఆర్ వాహనశ్రేణి మణుగూరు నుంచి బయలుదేరగానే మణుగూరు నుంచి రహదారిలో 100 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో పోలీసులు ఆయుదపానులై భారీగా మోహరించారు.ప్రైవేటు వాహనాలను,అనుమానితవాహనాలను నిలిపివేశారుతనికీలుముమ్మరంచేసారు.సీఎంకాన్వాయిని అక్కడక్కడ టి ఆర్ ఎస్ ప్రతి నిధులు,సర్పంచులు కాన్వాయ్‌ను ఆపితే తాము రాక రాక విచ్చేసిన సీ ఎమ్ ను కలుసుకుంటామని చెప్పినా పోలీసులు అనుమతించలేదు.

నిన్నటి వరకు మావోయిస్టులకు పెట్టింది పేరయిన ఏటూరునాగారం, ములుగు ఏజెన్సీలో గంటా ఇరవై నిమిషాల పాటు నిక్షేపంగా కెసిఆరు ప్రయాణించారు.ఒకరకంగా అడవి అందాలు ఆస్వాదించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube