ప్రస్తుతం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడులో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల పైనే దృష్టి పెట్టాయి.ఇక్కడ గెలవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోంది అని సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు మార్గం ఏర్పడుతుందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి.
అందుకే ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇది ఇలా ఉంటే ఈ విషయంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మరింత టెన్షన్ పడుతోంది.
ఇప్పటికి రెండుసార్లు తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది మరోవైపు ప్రభుత్వం వ్యతిరేకత తీవ్రంగా ఉందని సర్వే నివేదికలు టిఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి.
ఈ క్రమంలోని సెప్టెంబర్ మూడో తేదీన కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత కేసీఆర్ నిర్వహిస్తున్న సమావేశం కావడంతో దీనిపై అందరూ ఆసక్తిగా ఉన్నారు.ఈ సమావేశంలోనే మునుగోడులో గెలిచేందుకు ఏ ఏం చేయాలి ? ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలనే విషయం పైన కెసిఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు.వీలైనంత ఎక్కువమంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలనుమునుగోడులో ప్రచారానికి దింపాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.గ్రామాలకు కీలక ప్రజాప్రతినిధులను ఇన్చార్జిగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారట.
దీనిలో భాగంగానే వచ్చే నెల రెండో వారంలో చుండూరులో కెసిఆర్ సభ నిర్వహించబోతున్నారు.
ఆ తర్వాత మంత్రి కేటీఆర్ , హరీష్ రావు, మరి కొంతమంది మంత్రులు ఈ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో సభలు, సమావేశాలు నిర్వహించే విధంగా ప్లాన్ చేశారట.అలాగే రోడ్ షోలతో పాటు, ఇంటింటికి ప్రచారం చేయడం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం.అలాగే మునుగోడు నియోజకవర్గంతో పాటు , రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు , నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో దానికి సంబంధించి కీలక ప్రకటన కెసిఆర్ మూడో తేదీన జరిగే సమావేశంలో చేయబోతున్నారట.
మునుగోడులో గెలిచేందుకు కాంగ్రెస్ , బిజెపిలపై పై చేయి సాధించేందుకు ఏం చేయాలని విషయం పైన పార్టీ నేతలకు కేసీఆర్ హితబోధ చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే అనేక సర్వే సంస్థలను రంగంలోకి దింపిన నేపథ్యంలో … ఆ సర్వే నివేదికల వివరాలను శాసనసభ పక్ష సమావేశంలో చర్చించి మునుగోడులో గెలిచేందుకు బాటలు వేసుకోవాలి అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.