అనకాపల్లి జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
అదేవిధంగా తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.