చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక వైరస్ కరోనా.ప్రపంచదేశాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఎటు నుంచి వచ్చి ఈ మహమ్మారి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు అయోమయంలో పడిపోయారు.ఇప్పటికే లక్షల మంది ప్రాణాల హరించిన ఈ కరోనా భూతం.
ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో.
కరోనా నుంచి రక్షణ పొందాలంటే రోగనిరోధక శక్తిని బలపరుచుకోవాలని నిపుణులు ఎప్పటికప్పు సూచిస్తున్నారు.
అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి.
లవంగాల్లో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఫైబర్లు, మినరల్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.తద్వారా కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌ల నుంచి రక్షణ పొందొచ్చు.
కేవలం ఇమ్యూనిటీ పెంచడమే కాదు.లవంగాల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి.
సుగంధద్రవ్యాల్లో ఒకటైన లవంగం.జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తుంది.అందుకు ప్రతి రోజు మూడు లవంగాలను నమలడం లేదా లవంగాలతో తయారు చేసిన టీ తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.అలాగే మధుమేహం ఉన్నవారు లవంగాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
రోజుకు రెండు లవంగాలు తీసుకుంటే.ఎముకల దృఢంగా అవ్వడంతో పాటు కండరాలు, కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
ఇక బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా లవంగాలను డైట్‌లో చేర్చుకోవాలి.రాత్రి గ్లాసు నీటిలో రెండు లవంగాల్ని వేసి తెల్లారే వరకూ నానబెట్టాలి.
ఉదయం పరగడుపునే ఈ నీటిని తాగితే.శరీరంలో అదనపు కొవ్వును కరుగుతుంది.
ఇక రోజుకు రెండు లవంగాలు తింటే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటాయి.