పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి స్టార్ స్టేటస్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.‘ఛత్రపతి’ ( Chatrapathi )సినిమా నుండి ఊర మాస్ ఇమేజిని సంపాదించుకున్న ప్రభాస్, బాహుబలి సిరీస్ తో ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగాడు.ప్రస్తుతం ఆయన ఒక్క ఫ్లాప్ సినిమా మన స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల రేంజ్ లో వసూళ్లను సాధిస్తున్నాయి.ఇది ఏ హీరో అభిమాని అయినా ఒప్పుకోవాల్సిందే.
ఆయన గత రెండు చిత్రాలకు డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.అందులో ఒక సినిమాకి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తే, మరో సినిమాకి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఫ్లాప్ అయితేనే ఈ రేంజ్ వసూల్ల్లు వస్తున్నాయంటే, హిట్ అయితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అలాంటి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించే అరుదైన అదృష్టం కలిగితే ఏ హీరోయిన్ మాత్రం వద్దు అనుకుంటుంది.?

కానీ ఒక హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో సినిమా చేసేందుకు భయపడిపోయిందట, నేను అతనితో సినిమా చెయ్యను అని దర్శక నిర్మాతలతో నిర్మొహమాటంగానే చెప్పేసిందట.ఆ హీరోయిన్ మరెవరో కాదు, కాజల్ అగర్వాల్( Kajal Aggarwwal ). ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతీహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా అనుకున్నప్పుడే ఈ పాత్ర కి కాజల్ అగర్వాల్ సరిగ్గా సరిపోతుందని, ఆమెని సంప్రదించాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prashant Neel ).కానీ ప్రభాస్ తో నేను సినిమా చెయ్యను అంటూ కాజల్ మొహమాటం లేకుండానే చెప్పేసిందట.అంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వస్తే ఎవ్వరైనా వదులుకుంటారా.? , కాజల్ అగర్వాల్ ఎందుకు వదులుకుంది? , కాజల్ కి ప్రభాస్ కి మధ్య గొడవలు ఉన్నాయా వంటి సందేహాలు అభిమానుల్లో ఎప్పటి నుండో ఉన్నాయి.వీళ్లిద్దరు కలిసి గతం లో ‘డార్లింగ్’ మరియు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాల్లో నటించారు.

ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.మళ్ళీ ఈ క్యూట్ పెయిర్ ని వెండితెర మీద చూసేందుకు ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.కానీ అది ఇక ఎప్పటికీ సాధ్యపడేట్లు లేదని అంటున్నారు.
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సమయం లో ప్రభాస్ మరియు కాజల్ ఇద్దరూ ప్రేమించుకున్నారని, కానీ ఎందుకో ప్రభాస్ చివరి నిమిషం లో బ్రేకప్ చెప్పేసాడని, అప్పటి నుండి కాజల్ అగర్వాల్ ప్రభాస్ తో మాట్లాడడం లేదని ఫిలిం నగర్ లో వినిపించే వార్త.ప్రతీ హీరో పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియచేసే కాజల్ అగర్వాల్ , ప్రభాస్ పుట్టినరోజు కి మాత్రం శుభాకాంక్షలు తెలియచెయ్యకపోవడానికి కారణం, అతని మీద ఆమెకి ఉన్న కోపమే అని అంటుంటారు.
దీంతో వీళ్ళిద్దరినీ మరోసారి వెండితెర మీద చూడాలనే కోరిక, ఎప్పటికి నెరవేరదని అంటున్నారు.ఇక ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ మూవీ వచ్చేనెల 16 వ తేదీన విడుదల కాబోతుంది.
రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.