చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమా గా తెరకెక్కుతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి( Chiranjeevi ) ఏ సినిమా చేస్తున్నారు అనేది దాని మీద చాలా రోజుల నుంచి క్లారిటీ అయితే రావడం లేదు.ఇప్పటికే ఆయన కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సింది.
సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక కీలకపాత్ర వహించబోతున్నట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.కానీ మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన భోళా శంకర్ సినిమా ప్లాప్ అవ్వడంతో చిరంజీవి కళ్యాణ్ కృష్ణ ( Kalyan Krishna )సినిమాని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఇది బ్రో డాడీ సినిమాకి రీమేక్ గా వస్తుంది అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.అందుకే వరుసగా చిరంజీవి చేసిన రీమేక్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో చిరంజీవి కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇక వశిష్ఠ ( Vashishtha )డైరెక్షన్ లో వచ్చే సినిమా మంచి సక్సెస్ అయితే మళ్ళీ కళ్యాణ్ కృష్ణ తో సినిమా చేసే అవకాశం ఉంది.ఇక దాంట్లో భాగంగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలి.ఇక చిరంజీవి రీ ఎంట్రీ లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్లు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి.అందుకే చిరంజీవి కొంచెం కంటెంట్లపరంగా ఆలోచిస్తు సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉంటూనే సినిమాల పరంగా మంచి కంటెంట్ దొరకపోతే కొంచెం గ్యాప్ తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
చిరంజీవి తర్వాత చేసే సినిమాల లిస్ట్ లో మారుతి లాంటి డైరెక్టర్ ఉన్నప్పటికీ ఆ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతానికి వశిష్ఠ సినిమా తర్వాత చిరు కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలు చేస్తారని తెలుస్తుంది.
ఇక ప్రస్తుతానికి అయితే వశిష్ఠ సినిమా ఒకటే చేస్తున్నాడు…