ఖమ్మం జిల్లాలోని ఆరేగూడెంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని పొంగులేటి ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో డబ్బుల సంచులతో వస్తారన్న ఆయన ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తారని చెప్పారు.మనం ట్యాక్స్ లు కట్టిన డబ్బులు మనకే ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలిపారు.