ఎవరైనా వ్యక్తిగత విషయంలో ముఖ్యంగా దేవుడికి సంబంధించిన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.పైగా పవిత్రత అనేది అందరికీ చాలా ముఖ్యం.
కాబట్టి ఈ సమయంలోనే కాకుండా ఏ సమయంలో నైనా దేవుడికి సంబంధించిన విషయంలో పవిత్రతను పాటించాలి.అంతేకాకుండా మగవారు తాము వేసే మాలలు సమయంలో ఆడవారికి దూరంగా ఉండాలి.
లేదంటే అది అపవిత్రత కిందికే వస్తుంది.ఇలా ఎవరైనా కుల, మత భేదం లేకుండా రంగు రూపం, ఆస్తి అంతస్తులు తేడాలేకుండా దేవుడికి సంబంధించిన విషయంలో పవిత్రత నియమాలు పాటించాలి.
ఇక కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా మాలలు వేస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి కూడా మాల ధరించగా తమన్నా భుజంపై చేయి వేయడంతో ఓ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈయన తాజాగా అయ్యప్ప స్వామి మాల ధరించినట్లు కనిపించగా దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఆ ఫోటోలో చిరంజీవితో పాటు తమన్నా కూడా ఉండగా అందులో వాళ్ళు ఏదో పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు కనిపించింది.
ఇక ఇందులో చిరంజీవి తమన్నా పై చేతులు వేసి ఫోటో దిగగా ఈ ఫోటోను చూసిన నెటిజన్లు చిరంజీవి పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు.
స్వామి మాలలో ఉన్నప్పుడు అయినా చేతులు వేయడం మానండి స్వామీ అంటూ ట్విట్టర్ లో బాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక మరికొందరు చిరంజీవికి ఇంత మానర్స్ కూడా లేదు అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఎన్నో సూక్తులు చెప్పే చిరంజీవి ఇప్పుడేంటి ఇటువంటి సమయంలో ఇలా చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నారు.అలా అయ్యప్ప స్వామి మాలలే కాకుండా దేవుళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ముఖ్యంగా మగవాళ్ళు పాటించినప్పుడు ఆడవాళ్లకు దూరంగా ఉండాలన్న విషయం ఇంత కూడా తెలియదా అంటూ బాగా విమర్శలు చేస్తున్నారు.
మరి ఏ విషయానికైనా స్పందించే చిరంజీవి ఈ విషయానికి ఎలా స్పందిస్తాడో అనేది వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తుంది.
ఇక చిరంజీవి తో పాటు తన కుమారుడు రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాల ధరించిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వగా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాతో పాటు లూసిఫర్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.
అంతేకాకుండా వేదాళం రీమేక్ లో కూడా నటిస్తున్నాడు చిరంజీవి.వీటితోపాటు పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.
ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ రావడంతో అయ్యప్ప మాల దర్శించినట్లు తెలిసింది.ఇక ఈ మాల తర్వాత మిగతా సినిమా షూటింగ్ లలో పాల్గొననున్నాడు.