ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా అవకాశాలను అందుకుంటు తెలుగు చిత్ర పరిశ్రమనే శాసించిన హీరోగా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎన్నో అవార్డులు రికార్డులను సృష్టించిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి ఉందని చెప్పాలి.
అయితే ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి.ఎన్నో సినిమాలు వంద రోజులను పూర్తి చేసుకున్నయనే చెప్పాలి అయితే చిరంజీవి కెరియర్ లో ఒక సినిమాకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి.
ఆ సినిమా నెలరోజులు కూడా షూటింగ్ చేయలేదు కానీ థియేటర్లలో మాత్రం 500 రోజుల ప్రదర్శనమైంది.
ఇలా నెలరోజులు కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఆ సినిమా 500 రోజులు ఆడటం అంటే ఒక గొప్ప రికార్డు అని చెప్పాలి ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇలాంటి రికార్డు సాధించలేదు మరి చిరంజీవి ఇంత గొప్ప రికార్డు సృష్టించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే… 1982వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి మాధవి ( Madhavi ) హీరో హీరోయిన్లుగా కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ( Intlo Ramayya Veedilo Krishnayya ) .ఈ సినిమాను ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ పై కే.రాఘవ నిర్మించారు.
దర్శకుడిగా కోడి రామకృష్ణని.( Kodi Ramakrishna ) నటుడిగా గొల్లపూడి మారుతీ రావులని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ఇది.1982 ఏప్రిల్ 22వతేదీన విడుదలైనటువంటి ఈ సినిమా అప్పట్లో భారీ సంచలనాలను సృష్టించింది.కోడి రామకృష్ణ ఈ సినిమాని కేవలం 29 రోజులు మాత్రమే షూటింగ్ చేశారు.29 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా ఏకంగా 512 రోజులు ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది.ఈ సినిమాతో చిరు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
మిక్స్డ్ టాక్ జర్నీ స్టార్ట్ చేసింది.కానీ, మెల్లగా కలెక్షన్స్ వర్షం కురిపించింది.
ఈ సినిమాని కేవలం 3 లక్షల 25 వేల రూపాయాలతో పాలకొల్లు, నరసాపురం వంటి ప్రాంతాలలో షూటింగ్ పూర్తి చేశారు.ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించిన తదుపరి సినిమాలో కాస్త యావరేజ్ గానే నడిచాయి.
ఏది ఏమైనా ఒక సినిమా 500 రోజులు ఆడింది అంటే ఇది భారీ సంచలనం చెప్పాలి.ఇప్పట్లో వచ్చే సినిమాలు పట్టుమని పది రోజులు కూడా థియేటర్లలో ఉండటం లేదు.