పాపం అంటూ సాయం చేస్తే సీసీసీ పైనే విమర్శలా?

కరోనా విపత్తు నేపథ్యంలో షూటింగ్స్‌ లేకపోవడంతో సినీ కార్మికులు కనీసం తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఆ ఛారిటీకి చిరంజీవి కోటి విరాళం ఇవ్వగా ఇంకా పలువురు స్టార్స్‌ మరియు డైరెక్టర్స్‌ ఆర్థిక సాయంను ప్రకటించారు.

 Cinima Workers Protest Against Corona Crisis Charity Office, Chiranjeevi, Ccc, C-TeluguStop.com

దాంతో భారీ ఎత్తున సినీ కార్మికులకు నిత్యావసరాలను సరఫరా చేయడం జరిగింది.ఇప్పటి వరకు రెండు సార్లు మొత్తం అందరు కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ఇటీవలే షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి.అయితే పూర్తి స్థాయిలో షూటింగ్స్‌ జరగడం లేదు.కనుక మళ్లీ కొందరు అయినా నిత్యావసరాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.అయితే ఈసారి అందరికి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.

కనుక నిజంగా ఎవరికి అయితే అవసరం ఉన్నాయో వారిని గుర్తించాలి అంటూ ఆయా సంఘాలకు బాధ్యతలు అప్పగించడం జరిగింది.వారు కొందరిని మాత్రమే ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఎంపిక కాని వారు విమర్శలు చేస్తున్నారు.

Telugu Ccc, Chiranjeevi, Cinima, Supply, Indira Nagar, Stars Directors-Movie

ఇటీవల కొందరు సినీ కార్మికులు ఇందిరా నగర్‌లో ఉన్న సీసీసీ ఆఫీస్‌కు చేరి దర్నా నిర్వహించారు.తమకు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన వారు ఆ తర్వాత సీసీసీ లో జరుగుతున్న అవినీతిపై మండి పడ్డారు.ఈ విషయమై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పెద్ద మనసుతో వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తే ఇలా చేయడం ఏమాత్రం సరిగా లేదంటూ కార్మికులపై మండి పడుతున్నారు.

సాయం కావాలంటే సామరస్యంగా అడగాల్సింది పోయి ఇలా చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అంటూ చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube