అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిక్క చేష్టలకి హద్దులు లేకుండా పోతున్నాయి.తన వైట్ హౌస్ లో పని చేసే వారిపై మొదలు.
ఇకా ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు.తనకి అడ్డు వచ్చిన వారిని పదవి నుంచీ తొలగిస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఏకంగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన నాయయమూర్తిపైనే ట్రంప్ తన తెంపరి తనం చూపించాడు.వాగ్వాదానికి దిగాడు.
ఎం జరిగిందంటే…ట్రంప్ ప్రతిపాదిం చిన వలసల నిరోధ విధానాన్ని వ్యతిరేకించిన న్యాయమూర్తిని ట్రంప్ తప్పుపడుతూ ఆయనపై నువ్వు “ఓబామా జడ్జ్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.అయితే ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్స్ కూడా అలాంటిది ఏమి లేదు.మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ట్రంప్ వ్యాఖ్యలని ఖండించారు.
ఇదిలాఉంటే అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయాలని ఏ ఒక్క అధ్యక్షుడు వ్యతిరేకించింది కూడా లేదు…పైగా రాబర్ట్స్ రిపబ్లికంస్ నియమించిన వ్యక్తీ కూడా అయితే.ఏది ఏమైనా సరే ఒక ప్రధాన న్యాయమూర్తిని ట్రంప్ ఇలా బహిరంగంగా విమర్శించడం అనేది సరైన పద్దతి కాదని నెటిజన్లు ట్రంప్ చర్యలని ఖండిస్తున్నారు.
తాజా వార్తలు