చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే?

నిన్న ఇండియన్ సిల్వర్ స్క్రీన్ దగ్గర మాస్ జాతర జరిగింది అనే చెప్పాలి.ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గ్రాండ్ సినిమాలు నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి.

 Chandramukhi 2 Box Office Collection Day 1, Chandramukhi 2, Chandramukhi 2-TeluguStop.com

బోయపాటి స్కంద మాత్రమే కాదు కోలీవుడ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2( Chandramukhi 2 ) కూడా నిన్న రిలీజ్ అయ్యింది.ఈ నేపథ్యంలోనే థియేటర్స్ దగ్గర కోలాహలంగా ఉంది.

చంద్రముఖి మూవీ దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది.రజనీకాంత్ కెరీర్ లో మరపురాని సినిమాలలో ఒకటిగా ఉన్న చంద్రముఖి ఇప్పుడు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

రాఘవ లారెన్స్ ( Raghava Lawrence )మెయిన్ రోల్ లో నటించగా ఈయనకు జోడీగా కంగనా రనౌత్ ( Kangana Ranaut )హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకోగా భారీ అంచనాల మధ్య నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.</br

ప్రేక్షకులు సీక్వెల్ ను కూడా ఆదరిస్తున్నట్టే అనిపిస్తుంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 10 కోట్ల బిజినెస్ జరుపుకుని 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వరల్డ్ వైడ్ గా 45 కోట్ల బిజినెస్ చేయగా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్టు టాక్.మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ డే 5.5 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది.మరి స్కంద( skanda movie ) కూడా పోటీగా ఉండడం ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చంద్రముఖి కలెక్షన్స్ పై దెబ్బ పడేలానే ఉంది.

చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube