వారాహి రెండో దశ యాత్ర సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన భారీ బహిరంగ సభను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విడివాడ రామచంద్ర రావు( Vidivada RamachandraRao ) కు క్షమాపణలతో మొదలుపెట్టారు.2019 ఎన్నికలలో విడివాడ ని కాదని ఎవరికో టికెట్ ఇచ్చానని, ఆయన పార్టీ మారిపోయి మోసం చేస్తే విడివాడ మాత్రం జనసేన కోసం నిలబడ్డారని, ఇలాంటి నేతకు అప్పుడు టికెట్ ఇవ్వలేకపోయినందుకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని పవన్ చెప్పుకొచ్చారు.ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇస్తామనివిడివాడ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరాన్ని కూడా తణుకు ప్రజలకు పవన్ గట్టిగా చెప్పారు.ఇక్కడ పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి పవన్ సంకేతాలు ఇవ్వడానికే అంత గట్టిగా మాట్లాడినట్టుగా రాజకీయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
div class=”middlecontentimg”>

అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ( TDP )కూడా చాలా బలంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ గత ఎన్నికల్లో కేవలం 2000 ఓట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయారు.స్వల్ప మెజారిటీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి కారుమూరి మంత్రి కూడా అయిపోయారు.అయితే ఆ ఎన్నికలలో జనసేన అభ్యర్థికి 32 వేల ఓట్లు వచ్చాయి.పవన్ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి తమ అభ్యర్థి ఓడిపోయాడు తప్ప, తమ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఏ విదమైన వ్యతిరేకత లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.
మంత్రి పదవి వచ్చినా కారుమూరి పనితీరుపై విమర్శలు ఉండటం వల్ల ఈసారి తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అని తెలుగుదేశం భావిస్తుంది.అలాంటి సమయంలో సడన్గా ఎంట్రీ ఇచ్చిన పవన్ విడివాడకు టికెట్ హామీ ఇవ్వడంతో, జనసెన తెలుగుదేశం పొత్తులో ఈ సీటు విషయంలో పేచీలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
div class=”middlecontentimg”>

నిజానికి ఈ అసెంబ్లీ సీటు తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పాలి. జనసేన( Jana sena ) ఓట్లు చీలకపోతే గత ఎన్నికల్లోనే ఆరిమిల్లి రాధాకృష్ణ భారీ మెజారిటీతో గెలిచి ఉండేవారు.మరిప్పుడు ఆయనను కాదని జనసేన ఈ సీటు కోసం పట్టుపడితే పొత్తుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తాలు వస్తున్నాయి .