మాంసాహారంపై నిమ్మ‌ర‌సం పిండి తీసుకోవ‌చ్చా?

మ‌న‌లో ఎంద‌రో మాంసాహార ప్రియులు( Meat lovers ) ఉన్నారు.రెగ్యుల‌ర్ గా తినేవారు కొంద‌రైతే.

 Can Lemon Juice Be Taken With Meat? Non Veg, Meat, Lemon Juice, Lemon Juice Bene-TeluguStop.com

వారానికి ఒక‌ట్రెండ్ సార్లు తినేవారు మ‌రికొంద‌రు.పండుగలు మరియు వేడుకలు వ‌చ్చాయంటే ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

వంటింట్లో ర‌క‌ర‌కాల నాన్ వెజ్ ఐటెమ్స్ ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.అయితే మాంసాహారం వండే క్ర‌మంలో లేదా తినే క్ర‌మంలో చాలా మంది నిమ్మ‌ర‌సం యాడ్ చేస్తుంటారు.

అస‌లు మాంసాహారంపై నిమ్మ‌ర‌సం పిండి తీసుకోవ‌చ్చా అంటే ఎస్ అనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మాంసాహారానికి నిమ్మరసం( lemon juice ) కలిపి తీసుకోవడం సురక్షితం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందట‌.

పులుపు రుచిని క‌లిగి ఉండే నిమ్మరసం మాంసాహారానికి ప్ర‌త్యేక‌మైన రుచిని జోడిస్తుంది.మారినేషన్ సమయంలో నిమ్మ‌ర‌సం వేయ‌డం వ‌ల్ల‌.అందులోని సిట్రిక్ యాసిడ్ ( Citric acid )మాంసం మరింత కోమలంగా ఉండేలా చేస్తుంది.

Telugu Lemon Meat Veg, Tips, Latest, Lemon, Lemon Benefits, Meat-Telugu Health

నిమ్మరసం సహజమైన ప్రిజర్వేటివ్‌లా పని చేస్తుంది, అందువ‌ల్ల‌ నిమ్మ‌ర‌సం క‌లిపి మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే చాలా తాజాగా ఉంటుంది.అలాగే కొంద‌రు తినే స‌మ‌యంలో మాంసాహారంపై నిమ్మ‌ర‌సం పిండుతుంటారు.దీనివల్ల నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ( Vitamin C )మాంసాహారంలో ఉండే ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది, ఫ‌లితంగా శ‌రీరానికి పుష్క‌లంగా ఐర‌న్ అందుతుంది.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.

Telugu Lemon Meat Veg, Tips, Latest, Lemon, Lemon Benefits, Meat-Telugu Health

నిమ్మ‌ర‌సం జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది.మాంసాహారంపై నిమ్మ‌ర‌సం పిండి తీసుకుంటే ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

అయితే మాంసాహారంపై తాజా నిమ్మరసాన్నే ఉప‌యోగించండి.ప్రాసెస్డ్ లేదా ప్యాకేజ్డ్ నిమ్మరసం వాడొద్దు.

అటువంటి నిమ్మ‌ర‌సంలో రసాయనాలు ఉండే అవకాశాలు ఉంటాయి.తాజా నిమ్మరసం ఉపయోగించడం ఆరోగ్యకరంగా ఉంటుంది.

అలాగే వేడిగా ఉన్న మాంసంపై నిమ్మరసం పిండితే రుచి చేదుగా మారవచ్చు.అందుకే చల్లారిన తర్వాత నిమ్మ‌ర‌సం యాడ్ చేసుకోవాలి.

ఇక ఎక్కువ మొత్తంలో నిమ్మరసం ఉపయోగిస్తే ఆమ్లత్వ సమస్యలు త‌లెత్తుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube