బీఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలి..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.కొందరు డబ్బు సంచులతో వస్తున్నారన్న ఆయన మెదక్ ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరని తెలిపారు.

 Brs Should Win Once Again..: Minister Harish Rao-TeluguStop.com

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు రైతులను పట్టించుకోలేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కరువులు, కర్ఫ్యూలు మాత్రమే ఉండేవన్నారు.

కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని చెప్పారు.ప్రస్తుతం మెదక్ లో రెండు పంటలు పండుతున్నాయన్న మంత్రి హరీశ్ రావు రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందని తెలిపారు.

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.ఈ క్రమంలో ప్రజలు బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube