అమరావతి - ఆంధ్రజ్యోతి: బొత్స కామెంట్‌

ఆంధ్రజ్యోతి పత్రిక అంటే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మొదటి నుంచీ పీకలదాకా కోపం.జగన్‌కే కాదు ఆయన తండ్రి వైఎస్‌ కూడా ఎప్పుడూ ఆ రెండు పత్రికలు అంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు వెల్లగక్కేవారు.

 Bostha Satyanarayan Amaravathi And Andhrajyothi-TeluguStop.com

ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వచ్చీరాగానే ఈ ప్రతికకు చెందిన ఏబీఎన్‌ చానెల్‌పై నిషేధం విధించారు.ఆ పత్రిక ఎప్పుడూ జగన్‌కు మింగుడు పడని వార్తలనే రాస్తూ ఉంటుంది.

తాజాగా జగన్‌ ప్రతిపాదించిన మూడు రాజధానులపై కూడా ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురిస్తోంది.వీటిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆ పత్రికకు చెందిన పాత్రికేయులు పదే పదే అమరావతికి జరగనున్న అన్యాయంపై ప్రశ్నించారు.

Telugu Amaravathi, Andhra Pradesh, Andhrajyothi, Ys Jagan-Telugu Political News

9 థీమ్‌ సిటీలతో కూడిన అమరావతిని అక్కడి రైతులు కోరుకున్నారు.ఇలా వికేంద్రీకరించిన రాజధానిని కాదు.దీనిపైనే రాజధాని రైతులు పోరాటం చేస్తున్నారు.

అక్కడ వేల కోట్లతో నిర్మిస్తున్న హౌసింగ్‌ టవర్లను ఏం చేస్తారు అంటూ ఆ పత్రిక విలేకరి ప్రశ్నల వర్షం కురిపించారు.దీంతో మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.

అవన్నీ ఇప్పుడు అవసరమా.మిగతా విలేకరులు అడగని ప్రశ్నలు మీకే ఎందుకు? 9 థీమ్ సిటీలు చంద్రబాబు ప్రతిపాదన.ఆయన మాటలకు మేమెందుకు కట్టుబడి ఉంటాం.మేము ప్రజలకే తప్ప ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు.అయినా అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌, రాజ్‌భవన్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లాంటివి అమరావతిలోనే ఉంటాయి.అక్కడి వాళ్లకు ఇంకా ఏం కావాలి అని మంత్రి బొత్స సమాధానం ఇచ్చారు.

ఇక హౌసింగ్‌ టవర్ల గురించి మాట్లాడుతూ.సచివాలయం మొత్తం విశాఖకు తరలి వెళ్లిన తర్వాత ఇక వాటితో పనేముందని అనడం గమనార్హం.ఆ లెక్కన వేల కోట్లు వృథా అయినట్లే అని మంత్రి పరోక్షంగా చెప్పినట్లయింది.ఇప్పటికే చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చిన జగన్‌ సర్కార్‌.

అమరావతిలోని ఈ భవనాలను ఏం చేస్తుందో అంతుబట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube