నెల్లూరు ఎఫెక్ట్ : వారితో నేడు జగన్ అత్యవసర సమావేశం ? 

ఇటీవల కాలంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తిరుగుబావుట ఎగరవేయగా , అదే బాటలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ పైన , ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు .ఇంకా మరి కొంతమంది వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగురవేసేందుకు సిద్ధం అన్నట్లుగా సంకేతాలు పంపిస్తుండడంతో,  జగన్ అలర్ట్ అయ్యారు.

 Nellore Effect Jagans Emergency Meeting With Them Today,jagan, Ysrcp, Ap, Tdp, C-TeluguStop.com

2024 ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ క్వీన్ స్వీప్ చేస్తామని జగన్ ఆశలు పెట్టుకోవడమే కాకుండా, పార్టీ శ్రేణులకు ఇదే విషయమే పదేపదే చెబుతున్నారు.అయితే ఇప్పుడు వరుస వరుసగా పార్టీని వీడి టిడిపిలో చేరేందుకు వైసిపి ఎమ్మెల్యేలు సిద్ధమవుతుండడంతో జగన్ అలర్ట్ అయ్యారు ఈ వలసలకు బ్రేక్ వేసి , పార్టీలో పరిస్థితులను చక్కదిద్దకపోతే, 2024 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తింటామనే విషయాన్ని జగన్ గ్రహించారు.

Telugu Ap, Chandrababu, Jagan, Kotamsridhar, Venkatagi Mla, Ysrcp-Politics

అందుకే పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ తో జగన్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి 26 జిల్లాల పార్టీల రీజినల్ కోఆర్డినేటర్లు పాల్గొనబోతున్నారు.వీరందరికీ ఇప్పటికే సమాచారం అందడం తో హుటాహుటిన వీరంతా విజయవాడకు చేరుకుంటున్నారు.

వీరితో పాటు, బొత్స సత్యనారాయణ తో పాటు, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కూడా పాల్గొనబోతున్నారు.ఈ సమావేశంలోనే నియోజకవర్గంలో వారిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, పార్టీలో చోటు చేసుకుంటున్న గ్రూపు రాజకీయాలు, విభేదాలు అన్నిటి పైన చర్చించనున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Kotamsridhar, Venkatagi Mla, Ysrcp-Politics

ఈ సమావేశాల్లోని అన్ని సమస్యలకు పరిష్కారాలను జగన్ సూచించబోతున్నారట .అలాగే పార్టీ సీనియర్ నాయకులను రంగంలోకి దింపి అసంతృప్త నాయకులను గుర్తించి వారిని బుజ్జగించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారట.దీంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల కు జరగబోయే సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube