ప్రస్తుత కాలంలో బాలీవుడ్ ( Bolly wood )చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన సెలబ్రిటీలు దర్శక నిర్మాతల కాంబినేషన్లో సినిమాలు వస్తున్నప్పటికీ ఆ సినిమాలో మాత్రం పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.
ఇలా బాలీవుడ్ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో మేకర్ సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి సినిమాలను బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తున్నారు.అయితే రీమేక్ చిత్రాలను కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో పెద్ద ఎత్తున డిజాస్టర్లను ఎదుర్కోవడమే కాకుండా విమర్శలు కూడా చేస్తున్నారు.ఈ విధంగా సౌత్ సినిమాలను మాత్రమే కాకుండా కొన్ని పాటలను కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు రీమేక్ చేస్తున్నారు.
అయితే ఇలా రీమిక్స్ చేసిన ఓ పాట కారణంగా నటుడు కార్తీక్ ఆర్యన్ ( Karthik Aryan ) నటి కియార అద్వానీ( Kiyara Advani ) తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
గత ఏడాది గ్లోబల్ హిట్టుగా నిలిచిన పాకిస్థానీ సాంగ్ ‘పసూరి’ని.కార్తిక్ ఆర్యన్ తన కొత్త సినిమా ‘సత్యప్రేమ్ కీ కథ’ కోసం రీమేక్ చేశాడు.ఈ సినిమా నుంచి ఈ పాటను విడుదల చేయడంతో బాలీవుడ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ సౌత్ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ డామినేషన్ కనిపిస్తుంటే.మీరు ఇంకా రీమెక్స్ చేసుకుంటూ ఉన్నారు అంటూ సదరు సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.