హ‌రీశ్ సీఎం కావాల‌నుకున్నాడంట‌.. ఏకంగా అమిత్ షాను క‌లిశాడంటున్న బీజేపీ నేత‌

అసలే టీఆర్ ఎస్‌లో ఇప్పుడు చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్ప‌టికే కొత్త ముఖాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

 Bjp Leader Says Harish Wants Amit Shah To Be Cm, Harish, Politics, Bjp Leader, B-TeluguStop.com

ఒక ర‌కంగా చెప్పాలంటే అటు పార్టీలో ఇటు ప్ర‌భుత్వంలో కూడా చాలానే మార్పులు వ‌స్తున్నాయి.అయితే ఇవ‌న్నీ కూడా ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా త‌ర్వాత‌నే జ‌రుగుతున్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే.

అయితే హ‌రీశ్‌రావుకు ఇప్పుడు ప్ర‌భుత్వంలో అలాగే పార్టీలో కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఇస్తున్నారు సీఎం కేసీఆర్‌.ఇక్క‌డే ఆయ‌న‌కు ప్రాధాన్య‌త పెరుగుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇప్పుడు బీజేపీ నేత మేరుగు రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

గ‌తంలో సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు హ‌రీశ్‌రావు పెద్ద ఎత్తున ప్లాన్ చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.కేసీఆర్ ను దింపేసి త‌న‌ను సీఎం ప‌ద‌విలో కూర్చోబెట్టాల‌ని మూడేళ్ల క్రితం హ‌రీశ్ రావు నానా ప్ర‌య‌త్నాలు చేశారని, ఇందుకోసం అమిత్ షాను కూడా క‌లిశారంటూ సంచ‌ల‌నం రేపారు.

టీఆర్ ఎస్ పార్టీలో తనకు 35 మంది ఎమ్మెల్యేల స‌పోర్టు ఉంద‌ని, వారంతా కూడా త‌న‌నే సీఎం కావాల‌ని కోరుకుంటున్నారని, అమిత్ షాను హరీశ్ రావు కోరినట్లు చెప్పారు మేరుగు రాజు.

Telugu Amit Shah, Bjp, Eeta Rajendra, Harish-Telugu Political News

ఇక్క‌డే ఆయ‌న మ‌రో ట్విస్టు కూడా ఇచ్చారు.అదేంటంటే హ‌రీశ్ రావు న‌డిపించిన ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన ఆధారాల్ని తాను సరైన సమయంలో మీడియాకు వెల్ల‌డిస్తానంటూ సంచ‌లనం రేపారు.ఇంకో అడుగు ముందుకేసి అప్ప‌ట్లో హరీశ్ రావు చేస్తున్న సీఎం సీటు ప్రయత్నాల్ని అప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ అడ్డుకున్నారంటూ చెప్పారు.

కేసీఆర్ కు సీఎం సీటు ద‌క్కకుండా చేయ‌డం సరికాదని, ఇలాంటి ప్ర‌య‌త్నాలు మానుకోవాలంటూ సూచించారంట‌.ఇప్పుడు కూడా హరీశ్ అదును కోసం ఎదురుచూస్తున్నారని స‌రైన స‌మ‌యం వ‌స్తే మాత్రం దెబ్బ తీసేందుకు రెడీగా ఉన్నారంటూ చెప్పారు.

మ‌రి మంత్రి హరీశ్ వీటి మీద ఏమని బదులిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube