తెలంగాణలో బీజేపీకి అన్ని వర్గాల మద్ధతు ఉందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.బీసీని సీఎం చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు.
బీసీని సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.అలాగే ఇచ్చిన హామీలకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందా అని నిలదీశారు.
దళితుడిని సీఎం చేస్తామన్న హామీని ఈసారి అయినా నెరవేరుస్తారా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను అవమానిస్తున్నాయని ఆరోపించారు.
ఈ రెండు పార్టీల్లోనూ కుటుంబ పెత్తనం తప్ప సామాజిక న్యాయం లేదని విమర్శించారు.