బుల్లితెర యాంకర్ గా వెండితెర రంగమ్మత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి అనసూయ ( Anasuya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరీర్ మెదట్లో న్యూస్ రీడర్గా పనిచేసినటువంటి ఈమె అనంతరం యాంకర్ గా అవకాశాలను అందుకున్నారు.
ఇలా బుల్లితెర యాంకర్ గా సందడి చేస్తున్నటువంటి ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం( Jabardast programme ) ఎంతో మంచి పేరు తీసుకువచ్చిందని చెప్పాలి ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలోనే ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది అసలు ఎవరిని ఉద్దేశించి అనసూయ ఇలాంటి పోస్ట్ చేసిందా అని ఆలోచనలో పడ్డారు.మరి ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేశారు అనే విషయానికి వస్తే .
అనసూయకు ఏదైనా నచ్చితేనే చేస్తారని నచ్చకపోతే అది పనినైనా మనుషులనైనా దూరం పెడతారు అనే సంగతి మనకు తెలిసిందే.ఎవరో ఈమెను చాలా బాధ పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అనసూయ స్పందిస్తూ ఎడబాటే అగౌరవానికి నా సమాధానం.ఇక నేను స్పందించను, వాదులాడను, నాటకీయత ఉండదు.సింపుల్ గా కలవడం మానేస్తా అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ పోస్ట్ చేశారు.అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు అన్నది మాత్రం తెలియడం లేదు.