తెలంగాణలో అధికారంలోకి రావాలన్న దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.ఇందులో భాగంగా రాష్ట్రంపై దృష్టి సారించిన పార్టీ అధిష్టానం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది.
ఈ క్రమంలోనే రేపు తెలంగాణకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.ముందుగా శంషాబాద్ నోవాటెల్ లో బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు.
అనంతరం చేవెళ్లలో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి భారీ ఎత్తున జనసమీకరణకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.