అయ్యో పాపం కీర్తీ భట్.. హౌస్ మేట్స్ అంతా కలిసి జైల్లోకి దొబ్బేసారుగా!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది.బిగ్ బాస్ హౌస్ లో వివాదాలు, తిట్టుకోవడాలు ఎక్కువ అవుతున్నాయి.

 Bigg Boss Season 6 Keerthy Bhatt Get Emotional On Task Bigg Boss Season 6, Keert-TeluguStop.com

అంతే కాకుండా హౌస్ లో కొందరు కంటెస్టెంట్ లు గ్రూపులుగా గేమ్ ఆడుతూ మరి కొంతమందిని సింగిల్ గా చేసి ఆట ఆడుతున్నారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.తాజా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన టాస్క్ విషయంలో కూడా అదే జరిగింది.

తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కార్తీకదీపం సీరియల్ కీర్తిని ఒంటరిని చేసి అందరూ ఆడుకున్నారు.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు ఎవరు ఎక్కువ సేపు టీవీలో కనిపిస్తున్నారు అన్నది రేటింగ్ చెప్పాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో భాగంగానే గొడవకు దిగారు గీతూ, రేవంత్. అప్పుడు గీతూ అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటాను ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాను కాబట్టి 10 నిమిషాలు తనను చూపిస్తారని గీతూ తెలిపింది.

అప్పుడు రేవంత్ కూడా ఎక్కువ నామినేషన్స్ లో తానే ఉన్నాను అలాగే ఎక్కువ యాక్టివ్ గా కూడా ఉన్నాను కాబట్టి నన్ను ఎక్కువగా చూపించే అవకాశం ఉంది అని అంటాడు.

Telugu Arohi, Geethu, Kalyan, Keerthy, Nagarjuna, Revanth, Tollywood-Movie

అప్పుడు 0.3 కంటే తక్కువగా ఉన్న వారికి జీరో రేటింగ్ ఇవ్వాలి అని చెప్పగా అప్పుడు ఆరోహి, కళ్యాణ్, కీర్తికి జీరో రేటింగ్ ఇచ్చారు.ఇక వారి ముగ్గురిలో ఒకరిని జైల్లో ఉంచాలి అని చెప్పడంతో అందరూ ఏక నిర్ణయం తీసుకొని కీర్తిని జైల్లో పెట్టడానికి అంగీకరించారు.

దీంతో చేసేదేమీ లేక కీర్తి జైల్లోకి వెళ్ళింది.జైల్లోకి వెళ్లిన కీర్తి ఎమోషనల్ అయింది.ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube