తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.
ఇందులో భాగంగానే 14 మంది కంటెస్టెంట్ లలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది.ఇకపోతే మొదటి వారం చప్పగా సాగిపోగా రెండవ వారం గొడవలు కొట్లాటలతో ఒక్కసారిగా వేడెక్కింది.
ముఖ్యంగా నామినేషన్స్ తర్వాత హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య అసలైన వేడి మొదలయ్యింది.ఇకపోతే హౌస్ లో పవర్ అస్త్ర( Power Astra ) దక్కించుకోవడంలో భాగంగా రణధీర, మహాబలి పేర్లతో కంటెస్టెంట్స్ ని గ్రూపులుగా విభజించి ఓ గేమ్ పెట్టాడు బిగ్ బాస్.
ఇందులో అమర్‌దీప్, ప్రియాంక, శివాజీ, ప్రిన్స్, షకీలా, శోభాశెట్టి లు రణధీర గ్రూపులో ఉండగా, వారు ఒక తాళం గెలుచుకున్నారు.అయితే దాన్ని దొంగిలించాలని మహాబలి టీమ్ స్కెచ్ వేసింది.రాత్రి నిద్రపోయే సమయంలో దాన్ని కొట్టేయాలని ప్లాన్ వేసింది.కానీ శివాజీ( Shivaji ) ఆ తాళాన్ని ఒక బెల్టులో పెట్టి, నడుముకి కట్టేసుకోవడం, రతిక( Rathika ) దాన్ని కొట్టేయాలని ప్లాన్ చేయడం లాంటివి ప్రోమోలో చూపించారు.
మాయ అస్త్ర కోసం మలుపులో ఉంది గెలుపు పేరుతో రెండు సముహాల మధ్య బిగ్‌బాస్ రెండో గేమ్ పెట్టాడు.
ఇందులో భాగంగా స్పిన్ వీల్ లో సూచించిన విధంగా ఆయా కలర్స్ ఉన్న చోట కాళ్లు, చేతులు పెట్టాల్సి ఉంటుంది.గెలిచిన టీమ్‌కి మాయ అస్త్రకి( Maya Astra ) సంబంధించిన మరో తాళం లభిస్తుంది.అయితే ఈ ఆటలో భాగంగా బాడీని ఎలా పడితే అలా వంచేశారు.
ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు బిగ్‌బాస్ వాళ్ల బెండు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా బిగ్బాస్ రూల్స్ బ్రేక్ చేశారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి మాత్రం రెండో వారం నుంచి ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే లభిస్తోంది అని చెప్పవచ్చు.