హెల్త్ కేర్ వర్కర్లకు భారత రత్న ఇవ్వాలి.. పీఎం కు లేఖ రాసిన అరవింద్ కేజ్రీవాల్..!

కరోనా పై పోరాటం చేసిన హెల్త్ కేర్ వర్కర్లకు అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.ఇండియన్ డాక్టర్ అని ఆయన ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ తాను అన్నత మాత్రాన డాక్టర్ మాత్రమే కాదని.

 Bharath Ratna Award To Health Care Workers Delhi Cm Aravind Kejriwal Letter To P-TeluguStop.com

డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగులందరికి ఇది వర్తిస్తుందని అన్నారు.తమ ప్రాణాలను, కుటుంబాలను కూడా రోజుల తరబడి పట్టించుకోకుండా కరోనా రోగులకు చికిత్స చేసిన వీరు ఆ పురస్కారానికి అర్హులని ఆయన అన్నారు.

వారికి భారతరత్న ఇవ్వడం వల్ల దేశం మొత్తం హర్షిస్తుందని అన్నారు.అవసరమైతే నిబంధనలు మార్చి వీరికి అవార్డ్ ప్రకటించాలని అన్నారు.

లక్షలాది మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది రోగులకు నిరంతంగా సేవలు చేస్తూ వచ్చారని వారికి గౌరవించడానికి ఇదే తగిన ప్రమాణికం అని కేజ్రీవల్ అభిప్రాయపడ్డారు.భారత రత్న ఇచ్చినందువల్ల దేశంలోని ప్రతి పౌరుడూ సంతోషిస్తాడని ఆయన అన్నారు.

నేషనల్ డాక్టర్స్ డే నాడు ప్రధాని మోడీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ వైద్య సేవలను కొనియాడారు.అభివృద్ధి చెందిన ఇతర దేశాల కన్నా మన దేశ వైద్య సిబ్బంది లక్షలాది కరోనా రోగుల ప్రణాలను కాపాడారని ప్రశంసించారు.

వారి సేవలు వెలకట్టలేవని అన్నారు.ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ అభ్యర్ధన ప్రధాని ముందు ఉంచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube