నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి( Bhagavanth Kesari )”.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో పక్కా హిట్ అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయ్యారు.
మరి ఈ సినిమా మొన్న అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యింది.దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
మొన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు మౌత్ టాక్ బాగా రాగా ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకూ మరింత పుంజుకుంది.
బాలయ్య కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ దిశగా ఈ సినిమా దూసుకు పోతుంది అనే చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి టాక్ రావడంతో మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి.ఏకంగా రోజు 32.33 కోట్ల వసూళ్లను రాబట్టి బాలయ్య మళ్ళీ తగ్గేదే లే అని నిరూపించు కున్నాడు.ఇక రెండవ రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా కలెక్షన్స్ పై అప్డేట్ ఇచ్చారు.రెండవ రోజు కలెక్షన్స్ తో అప్పుడే బాలయ్య 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.రెండవ రోజు 19 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టడంలో మొత్తంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 51.12 కోట్ల గ్రాస్ ను అందుకుందని ప్రకటించారు.మరి రానున్న రోజులు వరుస సెలవలు కావడంతో ఈ సినిమా మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.
కాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.