ఓవర్సీస్ లో ఆ రికార్డ్ ను అందుకుంటున్న బాలయ్య.. మెగాస్టార్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేశారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ లో సులువుగా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించాయి.

 Balakrishna Rare Record In Overseas Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

భగవంత్ కేసరి విషయానికి వస్తే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 6 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించడం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Akhanda, Balakrishna, Chiranjeevi, Rare, Sreeleela, Tollywood-Movie

భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా కూడా సులువుగా 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ హీరోలలో ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లతో హ్యాటిక్ హీరోగా బాలయ్య నిలుస్తున్నారు.చిరంజీవి రాబోయే రోజుల్లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

బాలయ్య సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోవడం ఆయనకు కెరీర్ కు కలిసొస్తోంది.

Telugu Akhanda, Balakrishna, Chiranjeevi, Rare, Sreeleela, Tollywood-Movie

బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో కాజల్ రోల్ పరిమితం కాగా బాలయ్య, శ్రీలీల కాంబో సీన్లు మాత్రం ఎమోషనల్ టచ్ తో అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది.అనిల్ రావిపూడి రూటు మార్చి తెరకెక్కించిన భగవంత్ కేసరి కమర్షియల్ గా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమాలో ఇంటర్వల్ ట్విస్ట్ అద్భుతంగా ఉండనుందని సమాచారం అందుతోంది.భగవంత్ కేసరి క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా డే1 కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.బాలయ్య భవిష్యత్తు సినిమాలతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య బాబీ కాంబో మూవీ సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube