ఎన్టీఆర్‌కు బాలయ్య సాయం.. తూచ్ అంతా అబద్ధమే!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోఎన్టీఆర్ పాత్రలో నటించి మెప్పించిన పి.విజయ్ కుమార్ భార్యకు క్యాన్సర్ సోకిందని, ఆమెను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించగా బాలకృష్ణ వైద్యులకు మెరుగైన సేవలు అందించాలని సూచించినట్లు నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

 Balakrishna Did Not Help Lakshmis Ntr Actor Wife-TeluguStop.com

అయితే ఈ వార్తలను పి.విజయ్ కుమార్ కొట్టిపారేశారు.తన భార్యకు క్యాన్సర్ వచ్చిందనే వార్త నిజమని, కానీ ఆమెకు వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ జరిపించామని తెలిపాడు.బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కెమోథెరఫీ బాగా చేస్తారనే విషయం తెలుసుకుని తన భార్యను అక్కడ అడ్మిట్ చేయించానని ఆయన తెలిపారు.

బాలకృష్ణకు ఈ విషయం తెలియదని, ఆయన తమకు ఎలాంటి సహాయం చేయలేదని విజయ్ కుమార్ కుండ బద్దలు కొట్టాడు.

దీంతో సోషల్ మీడియాలో షికారు చేస్తున్న పుకార్లకు చెక్ పడినట్లయింది.

మరి లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్‌లా నటించిన విజయ్ కుమార్ గోడు బాలయ్య వద్దకు వెళుతుందో లేదో చూడాలి.ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube