ఎన్టీఆర్‌కు బాలయ్య సాయం.. తూచ్ అంతా అబద్ధమే!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోఎన్టీఆర్ పాత్రలో నటించి మెప్పించిన పి.

విజయ్ కుమార్ భార్యకు క్యాన్సర్ సోకిందని, ఆమెను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించగా బాలకృష్ణ వైద్యులకు మెరుగైన సేవలు అందించాలని సూచించినట్లు నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలను పి.విజయ్ కుమార్ కొట్టిపారేశారు.

తన భార్యకు క్యాన్సర్ వచ్చిందనే వార్త నిజమని, కానీ ఆమెకు వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ జరిపించామని తెలిపాడు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కెమోథెరఫీ బాగా చేస్తారనే విషయం తెలుసుకుని తన భార్యను అక్కడ అడ్మిట్ చేయించానని ఆయన తెలిపారు.

బాలకృష్ణకు ఈ విషయం తెలియదని, ఆయన తమకు ఎలాంటి సహాయం చేయలేదని విజయ్ కుమార్ కుండ బద్దలు కొట్టాడు.

దీంతో సోషల్ మీడియాలో షికారు చేస్తున్న పుకార్లకు చెక్ పడినట్లయింది.మరి లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్‌లా నటించిన విజయ్ కుమార్ గోడు బాలయ్య వద్దకు వెళుతుందో లేదో చూడాలి.

ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.