మోక్షజ్ఞ సినిమా గురించి మళ్లీ అదే మాట మాట్లాడిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి మళ్లీ వార్తలు ప్రారంభం అయ్యాయి.ఆ మధ్య 2023 లో మోక్షజ్ఞ సినిమా ( Mokshajna movie )ప్రారంభం అయ్యి 2024 లో సినిమా విడుదల అవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

 Balakrishna Comments About Mokshagna Film Entry , Mokshagna Film Entry , Balakri-TeluguStop.com

మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేసే సమయం కోసం ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో బాలకృష్ణ తాజాగా యూఎస్ లో జరిగిన ఒక కార్యక్రమం లో పాల్గొని మరోసారి వ్యాఖ్యలు చేశాడు.

మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కథ లు వింటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.తప్పకుండా ఒక మంచి సినిమా తో మోక్షజ్ఞ వస్తాడు అంటూ మీడియా వారితో చెప్పుకొచ్చాడు.దాదాపు అయిదు సంవత్సరాలుగా బాలయ్య ఇదే మాట చెబుతున్నాడు.

ఆయనకు బోర్‌ కొట్టడం లేదేమో కానీ ప్రేక్షకులు ఇంకా ఫ్యాన్స్ కు మాత్రం ఈ విషయం గురించి ఆయన వ్యాఖ్యలు విని వినీ బోర్ గా అనిపిస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారు.బాలయ్య కి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యం లో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పదే పదే జనాలు అభిమానులు బాలయ్య ను ప్రశ్నిస్తున్నారు.

ఆయన మళ్లీ మళ్లీ అదే వ్యాఖ్యలు చేస్తూ ఉండటం కరెక్ట్‌ అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి బాలయ్య యొక్క వ్యాఖ్యలు మోక్షజ్ఞ సినిమా గురించి మరింతగా అంచనాలు పెంచుతుంది అనడంలో సందేహం లేదు.ఇప్పటి వరకు దర్శకుడు ఎవరు( director )… నిర్మాత ఎవరు.కథ ఏంటి అనేది క్లారిటీ లేదు.అయినా కూడా మోక్షజ్ఞ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇటీవల మోక్షజ్ఞ చాలా సన్నగా అయ్యాడు.

అంతే కాకుండా మంచి లుక్ తో కూడా అలరిస్తున్నాడు.మొత్తానికి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ గడచిన అయిదు ఆరు సంవత్సరాలుగా వార్తల్లో ఉంటూనే ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube