హృదయ కాలేయం కొబ్బరిమట్ట వంటి సినిమాలకు దర్శకుడుగా పని చేసినటువంటి సాయి రాజేష్ ( Sai Rajesh )!తాజాగా బేబీ సినిమా( Baby Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా తిరిగి ఎక్కిన బేబీ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే.
ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది కేవలం 10 కోట్లతో నిర్మాణం అయినటువంటి ఈ సినిమా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.
ఇలా ఈ సినిమా ద్వారా నటి వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) అలాగే ఆనంద్ దేవరకొండ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తదుపరి సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై ఇతర భాష డైరెక్టర్ ల దృష్టి పడిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బేబీ సినిమాను హిందీలో( Hindi ) రీమేక్ చేయడానికి డైరెక్టర్ సాయి రాజేష్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం.ఇక్కడ వైష్ణవి చైతన్యకు బేబీ సినిమా( Baby Movie ) ద్వారా లైఫ్ ఇచ్చినటువంటి సాయి రాజేష్ హిందీలో కూడా ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ముగ్గురు అమ్మాయిల పేర్లను పరిశీలిస్తున్నారని, వీరిలో ఒకరిని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది.ఇక హిందీ సినిమాకి కూడా డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాతో మరొక స్టార్ హీరో కుమారుడిని ఇండస్ట్రీకి లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది.మరి ఆ హీరో కుమారుడు ఎవరు ఏంటి అనే విషయాలను త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
.