అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా( Jawan movie ) విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా టాక్ చాలా అద్భుతంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఇది బాహుబలి రికార్డులను సైతం అధిగమిస్తుంది అని కొంతమంది అంటుంటే బాలీవుడ్ చరిత్ర తిరగరాయబోతుందని మరికొంత మంది అంటున్నారు.ఏది ఏమైనా జవాన్ ద్వారా షారుక్ ఖాన్ కి మాత్రం మంచి హిట్టు పడ్డట్టే అనుకోవచ్చు.
ఇది కేవలం షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) కి మాత్రమే కాదు మొట్టమొదటిసారిగా ఒక హిందీ సినిమాను దర్శకత్వం వహించిన అట్లీకి కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ బాలీవుడ్ లో ఒక సినిమాని డైరెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది.
అలాగే అట్లీ విషయంలో కూడా అదే జరిగింది.అట్లీ( Atlee Kumar ) 2013లో మొట్టమొదటిసారిగా రాజారాణి సినిమాకు( Raja Rani ) దర్శకత్వం వహించాడు.ఈ సినిమా దర్శకత్వం వహించడానికి ముఖ్య కారణం నయనతార.ఆమె ఓకే చెప్పగానే మిగతా స్టార్ కాస్ట్ అంత సెట్ అయిపోయింది.అలాగే సినిమా కూడా విజయం సాధించింది.తెలుగులో కూడా ఈ సినిమా విజయం సాధించింది.
అయితే నయనతార మాత్రమే ఎందుకు అంత స్పెషల్ అనే మాట వినిపిస్తుంది ఎందుకంటే జవాన్ సినిమాలో కూడా షారుఖాన్ ని మించి నయనతార ప్రాధాన్యత ఖచ్చితంగా కనిపించింది.అట్లీ నయనతార మధ్యలో ఉన్న స్నేహబంధం అలాంటిది.
ఒక మనిషి తో స్నేహం చేస్తే లేదా ఒక దర్శకుడు తాను స్నేహం చేసిన లేదా తను ఇష్టపడ్డ అమ్మాయిని క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఒక లెవెల్ లో డిజైన్ చేస్తారు.అట్లీ విషయంలో కూడా అలాగే జరిగింది నయనతారపై ఉన్న స్నేహంతో ఆమెపై ఉన్న అభిమానంతో అట్లీ ఆమె పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు.మొదటి సినిమా రాజారాణి నుంచి ఇప్పటి జవాన్ వరకు వారిద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంది.ఆమె వల్లే ఈరోజు అట్లీ ఈ స్థాయిలో ఉన్నాడు అనే వార్తలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఏది ఏమైనా ఆ షారుక్ ఖాన్ తో సినిమా చేయించడం అలాగే అట్లీని బాలీవుడ్ కి పరిచయం చేయడం వెనక నయనతార హస్తముంది.