అశ్విన్ బాబు, అనీల్ కన్నెగంటి, ఎస్వీకే సినిమాస్ 'హిడింబ' ఫస్ట్ గ్లింప్స్ విడుదల

యంగ్ హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అనీల్ కన్నెగంటి కాంబినేషన్ లో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హిడింబ.ఈ చిత్రంలో అశ్విన్ బాబుకు జోడిగా నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది.

 Ashwin Babu, Aneel Kanneganti, Hidimbha First Glimpse Out Ashwin Babu , Aneel-TeluguStop.com

కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్ అయ్యింది.ఫస్ట్‌ గ్లింప్స్‌ లో యాక్షన్ అదిరిపోయింది.

అశ్విన్ బాబు రౌడీలని కొడుతున్న ఫైట్ సీక్వెన్స్ టెర్రిఫిక్ గా వుంది.సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉన్నాయి.

దర్శకుడు అనీల్ కన్నెగంటి అశ్విన్ బాబుని పవర్ ఫుల్ పాత్రలో చూపించారు.నందితా శ్వేత పోలీస్‌గా కనిపించింది.సుభలేఖ సుధాకర్ రాజకీయ నాయకుడిగా కనిపించారు.హిడింబ ఫస్ట్ అశ్విన్ బాబు హైలీ యాక్షన్, ఫస్ట్-క్లాస్ సాంకేతిక విలువలతో ఆకట్టుకుంటుంది.ఈ చిత్రానికి వికాస్ బాడిసా సంగీతం అందించగా, రాజశేఖర్ బి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తారాగణం:

అశ్విన్ బాబు, నందితా శ్వేత, శుభలేఖ సుధాకర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

దర్సకత్వం: అనీల్ కన్నెగంటి, బ్యానర్: ఎస్వీకే సినిమాస్ , నిర్మాత: గంగపట్నం శ్రీధర్ , సంగీతం: వికాస్ బాడిసా, డీవోపీ: రాజశేఖర్ బి పీఆర్వో: వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube