ఆషికా రంగనాథ్.( Ashika Ranganath ) నాగార్జున సరసన నా సామి రంగ( Naa Saami Ranga ) సినిమాతో సంక్రాంతికి సందడి చేసి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ కుర్ర హీరోయిన్.
ఇక ఒక్కసారి హిట్టు దొరికితే మన టాలీవుడ్ లో అందరూ ఆ హీరోయిన్ వెనకాలే పడతారు అనేది తెలిసిన విషయమే.అయితే 27 ఏళ్ల ఆషిక రంగనాథ్ తెలుగులో నటించడం ఇది రెండో సినిమా.2023 లో ఆమిగోస్ చిత్రంలో( Amigos ) కళ్యాణ్ రామ్ సరసన ఈ అమ్మడు మొదటిసారిగా తెలుగు లో నటించింది.ఆ చిత్రంలో పెద్దగా ప్రభావం చూపించకపోయినా నా సామి రంగా సినిమాలో అయితే నాగార్జున ను( Nagarjuna ) సైతం తన నటన తో డామినేట్ చేసి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది.
దాంతో అందరూ ప్రస్తుతం ఆషిక రంగనాథ్ గురించే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.కుర్ర హీరోయిన్ అయినప్పటికీ సీనియర్ హీరోలకు చక్కగా సరిపోతుంది అని అనుకుంటున్నారు.లేటుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆషిక మొదట కన్నడ సినిమా రంగంలో దాదాపు 15 సినిమాల వరకు నటించింది.2016లో క్రేజీ బాయ్స్( Crazy Boys ) అనే సినిమా తో వెండితెరపై తొలిసారి కనిపించింది ఆషిక.ఆ తర్వాత కన్నడ హీరో అయినా శివ రాజ్ కుమార్ తో మాస్ లీడర్( Mass Leader ) అనే మరో సినిమాలో కనిపించింది.దాంతో ఎక్కువగా సీనియర్ హీరోలతోనే జత కట్టిన ప్రభావము మరేంటో తెలియదు కానీ ఈ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లోని సీనియర్ హీరోలందరికీ( Senior Heroes ) మంచి కాంబినేషన్ అవుతుంది అని దర్శకులు భావిస్తున్నారు.
కన్నడ తో పాటు 2022లో ఒక తమిళ చిత్రంలో కూడా నటించి అక్కడ కూడా మంచి సినిమా అవకాశాలు పొందే ప్రయత్నంలో ఉంది ఆషిక.కన్నడ పరిశ్రమ నుంచి మెల్లిగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ అమ్మాయి హవా పెరుగుతుంది.మరి కొన్ని రోజులు ఆగితే తెలుగులో కూడా మరిన్ని మంచి చిత్రాలు నటించే అవకాశం కూడా ఉంది అన్నీ కలిసి వస్తే భవిష్యత్తులో ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో కూడా నటిస్తుంది ఈ ఆషిక రంగనాథ్.