నాగ్ సరసన ఆ యంగ్ భామ ఫిక్స్.. ఎవరంటే?

అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు.

 Ashika Ranganath Confirmed For ‘naa Saami Ranga’, Naa Saami Ranga, Ashik-TeluguStop.com

నాగార్జున ‘ది ఘోస్ట్’( The Ghost ) సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న తర్వాత కొద్దీ రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.ఇక ఈ మధ్యనే కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.

Telugu Ashikaranganath, Naa Saami Ranga, Nagarjuna-Movie

ఇటీవలే నాగార్జున తన కొత్త సినిమాను చాలా గ్యాప్ తర్వాత అనౌన్స్ చేసిన విషయం విదితమే.”నా సామిరంగ’ ( Naa Saami Ranga )అనే టైటిల్ తో నాగార్జున ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఈ టీజర్ ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంది.ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ అనిపించుకుని చాలా రోజుల తర్వాత ఈయన సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాడు.

.నాగ్ ఈ సినిమా కోసం మాస్ మేకోవర్ లోకి మారి పోయాడు.ఈ మేకోవర్ ఫ్యాన్స్ ను బాగా అలరించింది.2024 సంక్రాంతి బరిలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అని సినిమా ప్రకటన రోజే చెప్పి మరింత క్యూరియాసిటీ పెంచేసాడు.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బిజీ డైరెక్ట్ చేయబోతున్నాడు.

Telugu Ashikaranganath, Naa Saami Ranga, Nagarjuna-Movie

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సినిమాపై హైప్ పెంచేస్తునే ఉంది.తాజాగా హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లను పరిశీలించి చివరకు కన్నడ భామ ఆషికా రంగనాథ్( Ashika Ranganath ) ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

ఈ భామ ఇప్పటికే కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది…

కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని టాక్.మరి ఆ రోల్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

కాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube