అమెరికాలో ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి మరెన్నో సేవా సంస్థలు ఉన్నాయి.అయితే వాటిలో ఆశాజ్యోతి కూడా ఒకటి అన్నిటిలో ఒకటిగా కాకుండా తమ సంస్థకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
నిస్వార్ధమైన సేవ భావంతో ఏంతో మంది పేదవారికి రోగులకి తమకి వచ్చే విరాళాలతో సాయం చేస్తోంది.అందులో భాగంగానే ఎప్పటిలాగా అమెరికాలో సెప్టెంబర్ 16 వ తేదీన ఉదయం 9:30 గంటలకు BRIDGEWATER, PISCATAWAY, NJ.లోని DUKE ISLAND PARK నందు 5K Run/Walk నిర్వహిస్తోంది.
ఈ 5K Run/Walk కి చిన్నారులు మొదలు యువతీ యువకులు అందరూ పాల్గొనవచ్చు…ఈ సంస్థ 2003 లో స్థాపింఛి గడిచిన 10 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు అమెరికాలోని వివిధ నగరాలలో ప్రతి ఏట 5K రన్ ను నిర్వహిస్తోంది.ఈ సంస్థని స్థాపించిన సమయంలో కేవలం 3 నగరాలలో వారి కార్యకమ్రాలు జరిగేవి , ఇప్పుడు అవి 10 నగరాలకు విస్తరించాయని సంస్థ నిర్వాహకులు అంటున్నారు.అందరి సమిష్టి కృషి ఫలితంగా ఈ సంస్థ సేవలు విస్తరణ జరుగుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ సంస్థ ద్వారా 3000 మంది కి పైగా విధ్యార్దులు ఇప్పటివరకు విద్యా వంతులు అయ్యారని.రోగులకి ఉచిత మందులు మెడికల్ క్యాంప్ లు ఈ సంస్థ ద్వారా అందచేస్తున్నామని వారు తెలిపారు.16 వ తేదీన అందరూ ఈ run లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలకై -.
https://www.asha-jyothi.org/events/2018njrun