'భగవంత్ కేసరి' నుండి అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్.. డాన్ గా లుక్ అదిరింది!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.( Bhagavanth Kesari ) ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Arjun Rampal First Look Poster In Bhagavanth Kesari Details, Arjun Rampal, Balak-TeluguStop.com

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు.

కొన్ని పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు.

అయితే దసరా బరిలో రాబోతున్న నేపథ్యంలో రిలీజ్ కు కొద్దీ సమయం మాత్రమే ఉంది.దీంతో ఎప్పుడెప్పుడు మరింత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

దీంతో తాజాగా ట్రైలర్ అనౌన్స్ మెంట్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుసగా అప్డేట్స్ ను ఇస్తూ పోతున్నారు.

రేపు అక్టోబర్ 8న భగవంత్ కేసరి ట్రైలర్ ను( Bhagavanth Kesari Trailer ) హనుమకొండలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.మరి ఈ ట్రైలర్ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తున్న అర్జున్ రాంపాల్( Arjun Rampal ) ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేసారు.బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరి ఈయన డాన్ లుక్ అందరిని ఆకట్టు కుంటుంది.

నేషనల్ అవార్డు విన్నర్ వెర్సటైల్ నటుడు అర్జున్ రాంపాల్ రాహుల్ సంగ్విగా కనిపించబోతున్నాడు అంటూ ఈయన లుక్ ను పరిచయం చేస్తూ పాత్రని రివీల్ చేశారు.మరి రేపు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube