మహేష్‌తో పోటీకి ఆలోచనలో పడ్డ బన్నీ.. ఈసారి లేనట్టేనట!

టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.కాగా ఇటీవల సంక్రాంతి పండగకు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.

 Mahesh Babu For Next Summer But Not Allu Arjun, Allu, Mahesh Babu, Sarileru Neek-TeluguStop.com

విశేషమేమిటంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి.దీంతో ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.

బన్నీ ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన బన్నీ, షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నాడు.

కాగా మహేష్ బాబు ఇటీవల తన నెక్ట్స్ మూవీ ‘సర్కారు వారి పాట’ని దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.లాక్‌డౌన్ పూర్తికాగానే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్‌లు రెడీ అవుతున్నాయి.

అయితే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా కేవలం తెలుగు భాషలోనే వస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కానీ బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవచ్చని, పైగా సుకుమార్ సినిమా కావడంతో ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి వచ్చే వేసవికి మహేష్ బన్నీల మధ్య పోటీ ఉంటుందా లేక సోలోగానే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube