తమిళ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ చిత్రం విడుదల విషయంలో పలు అడ్డంకులు ఎదుర్కొంటుంది.ఈ సమ్మర్లో ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడినది.
సినిమా విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తమ డబ్బులు తమకు ఇచ్చేయాలంటూ బయ్యర్లు నిర్మాతలు మరియు విజయ్ వెంట పడ్డారు.సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయడం సాధ్యం కాదని బయ్యర్లు ఈ ఆందోళన మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో జులై నెలలోనే సినిమాను విడుదల చేయాలని మాస్టర్ మేకర్స్ నిర్ణయించుకున్నారు.ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా సినిమా థియేటర్లు ప్రారంభం అయిన వెంటనే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
అయితే సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు సీఎం మరియు కోర్టుకు లేఖలు రాశాడు.తమిళనాడులో ప్రస్తుతం వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదలకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ విజ్ఞప్తి చేశాడు.
ఇదే సమయంలో మాస్టర్ చిత్ర మేకర్స్ కూడా సినిమాను విడుదల చేయనివ్వండి అంటూ విజ్ఞప్తి చేస్తూ సీఎంకు లేఖ రాయడం జరిగింది.తగిన జాగ్రత్తలు తీసుకుని తాము సినిమాను విడుదల చేస్తామని, అన్ని విధాలుగా సామాజిక దూరం పాటిస్తూ సినిమాను ప్రదర్శిస్తామంటూ నిర్మాతలు లేఖలో పేర్కొనడం జరిగింది.అయితే ఈ విషయంలో మాస్టర్‌కు ఊరట లభిస్తుందా లేదంటే ఈ విపత్తు సమయం పూర్తి అయ్యే వరకు ఆగాల్సిందే అంటూ ఆదేశాలు వస్తాయా అనేది చూడాలి.