తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా దాదాపుగా వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘తలైవి’ చిత్రం ఎప్పుడు విడుదల అయ్యేనో తెలియదు కాని సినిమాకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది.అద్బుతమైన స్పందన ఉన్న ఈ నేపథ్యంలో సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 55 కోట్లు ఇచ్చి మరీ కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యింది.
ఇప్పటికే ఈ డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తోంది.ఈ మొత్తం సినిమా విడుదల సమయం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని ముందే ఆ సంస్థ క్లోజ్ చేసింది.
బడ్జెట్‌లో సగానికి పైగా డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఫుల్ హ్యాపీ.సినిమా షూటింగ్ ఈ ఏడాదిలో పూర్తి చేయాలని భావించినా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది.
ప్రస్తుతంకు షూటింగ్ జరగడం లేదు.మరికొన్ని రోజుల్లో షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ చిత్రంలో అమ్మ పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో సౌత్‌లో కంటే ఉత్తరాదిన ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంది.అన్ని భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా సినిమాను ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో జయలలిత జీవితంకు చెందిన పలు చీకటి కోణాలను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.