జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన “అరవింద సమేత వీర రాఘవ”( Aravinda Sametha Veera Raghava ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు అయ్యింది.రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో 2018లో వచ్చిన ఈ మూవీ చాలా విషయాల్లో ఆకట్టుకుంది.
ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన చిత్తూరు యాస డైలాగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాయి.ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ భావించారు, త్రివిక్రమ్ దీనిపైన బాగానే ఆశలు పెట్టుకున్నాడు.
చివరికి ఈ మూవీ అందరి అంచనాలను మించి హిట్ అయింది.ఎన్టీఆర్( NTR ) ఒక అద్భుతమైన యాక్టర్ అని చెప్పుకోవచ్చు.
యాక్షన్ సన్నివేశాల్లో అతడు అద్భుతంగా నటిస్తాడు.అందుకే ఎప్పుడూ ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ సినిమాలు తీసే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అరవింద సమేత వీర రాఘవ తీశాడు.
ఇందులో రక్తపాతం, హింసతో కూడిన సన్నివేశాలు చాలానే ఉంటాయి.అయితే ఈ మూవీని కొంతమంది సరదాగా ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటారు.
ప్రస్తుతం ఈ సినిమాని మరోసారి ట్రోల్ చేస్తున్నారు.
ఒక వీడియో క్లిప్ షేర్ చేసి మరీ త్రివిక్రమ్( Trivikram Srinivas ) కథ, కథనాన్ని విమర్శిస్తున్నారు.ఆ వీడియో క్లిప్ మంచు విష్ణు నటించిన ‘దూసుకెళ్తా’( Doosukeltha ) చిత్రంలోనిది.ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది.
ఆ సీన్‌లో కమెడియన్ అలీ మాట్లాడుతూ తెలుగు సినిమా స్టోరీ ఇలాగే ఉంటుంది అంటూ కొందరికి ఒక స్టోరీ చెప్తాడు.”అశాంతిగా ఉన్న ఊరిని హీరో ప్రశాంతంగా మారుస్తాడు” అని కథ చెప్పడం ప్రారంభిస్తాడు.
అది వింటున్న ఒక వ్యక్తి “ఎలా?” అని అమాయకంగా తన సందేహాన్ని బయటపడతాడు.అప్పుడు అలీ “అందర్నీ ఇష్టమొచ్చినట్టు కొట్టి.
ఇలా.కొట్టి చివరికి శాంతి వచనాలు చెప్పాలి.” అని చెబుతూ తన పక్కన ఉన్న వారందరినీ కొట్టేస్తుంటాడు.
అలీ( Comedian Ali ) చెప్పిన ఇలాంటి సిల్లీ స్టోరీ నే “అరవింద సమేత వీర రాఘవ” ప్రిమిస్ ఈ వీడియోకి ఫన్నీగా క్యాప్షన్ జోడించారు.ఇది చూసి చాలామంది అవును నిజమే అని బాగా నవ్వుకుంటున్నారు.త్రివిక్రమ్ కొన్ని సినిమాలు అద్భుతంగా ఉంటే మరి కొన్ని సినిమాలు ఇలా చెత్తగా రొటీన్ గా ఉంటాయని ఇంకొందరు కామెంట్లు చేశారు.
త్రివిక్రమ్ మహేష్ బాబు( Mahesh babu )ను కూడా ఇలానే రెండుసార్లు ముంచేసాడు, ఇకపై అతనికి ఏ స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు అని మరి కొందరు అన్నారు.ఏదేమైనా ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కారణంగా మంచి హిట్టు లభించింది.
ఇకపోతే ఎన్టీఆర్ ఈ మూవీలో తన తండ్రిని హత్య చేసిన వారిని వెంటాడి వేటాడి మరీ హతమార్చుతాడు.ఇలాంటి హింసకు పాల్పడుతూనే గ్రామాల్లో శాంతి నెలకొల్పేందుకు ట్రై చేయడం సిల్లీగా అనిపిస్తుంది.
కానీ త్రివిక్రమ్ మేజిక్ మేకింగ్, తమన్( Thaman ) మ్యూజిక్ ఈ మూవీ ని సూపర్ హిట్ గా మలిచాయి
.